/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
Trump, US Stock Markets
మెక్సికో మరియు కెనడా నుండి వచ్చే వస్తువులపై 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఇది అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఉత్తర అమెరికాలో వాణిజ్య యుద్ధం జరగొచ్చనే భయాలు రేకెత్తాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. ట్రంప్ వ్యాఖ్యలు ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్‌లను బాగా దెబ్బతీశాయి. దీంతో మెక్సికన్ పెసో, కెనడియన్ డాలర్ రెండూ పడిపోయాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ 649.67 పాయింట్లు పడిపోయింది. ఎస్ అండ్ పి500..104.78 పాయింట్లు కోల్పోయింది. నాస్డాక్ కాంపోజిట్ 497.09కు పడిపోయింది. దీనివలన స్టాక్ మార్కెట్లో చాలా నష్టమే జరిగిందని చెబుతున్నారు.
సుంకాలపై వెనక్కు తగ్గేదేలే..
అలాగే మరోవైపు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాలపై కూడా ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. కెనడా, మెక్సికోలపై ట్రంప్ విధించిన సుంకాలు ఏడాదికి 900 బిలియన్ డాలర్ల విలువైన యూఎస్ దిగుమతులను కవర్ చేస్తాయని...దీని వలన ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ఎదురుదెబ్బ కలిగిస్తుందని...అమెరికా ఆర్థిక వేత్తలు అంటున్నారు. అమెరికాలో మదకదవ్యాల వాడుకను తగ్గించడానికి చైనా నుంచి వచ్చే ఫెంటానిల్ మందులపై 25శాతం సుంకం విధించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, 2023లో USలో 72,776 మంది సింథటిక్ ఓపియాయిడ్ల వల్ల మరణించారు...అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా వైఫల్యం చెందిందని ఆరోపించింది వైట్‌హౌస్. అందుకే 10 శాతంగా ఉన్న సుంకాలను 20 శాతానికి పెంచుతున్నట్లు చెప్పింది. మరోవైపు కెనడా నుంచి వచ్చే ఇంధనాలపై 10 శాతం సుంకాలను విధించారు.
Also Read: USA: ఉక్రెయిన్ కు షాక్..మిలటరీ సాయం నిలిపేసిన అమెరికా