/rtv/media/media_files/2025/07/21/air-india-flight-2025-07-21-14-09-39.jpg)
Air India flight
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్‌వేపై అదుపుతప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందులోని ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
Also Read : పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!
Air India Flight From Kochi Veers Off Runway
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియాకు చెందిన AI 2744 విమానం సోమవారం ఉదయం కొచ్చి నుంచి ముంబైకి చేరుకుంది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేపై అదుపుతప్పింది. అయితే ముంబైలో రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం వల్లే రన్‌వేపై విమానం అదుపు తప్పిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.
Also Read: అమెరికా వెళ్లాలనకుంటున్న వారికి మరో బిగ్ షాక్.. హెచ్-1బీ వీసా ప్రక్రియలో కీలక మార్పులు!
విమానం రన్‌వేపై అదుపు తప్పినప్పటికీ కూడా సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఆ తర్వాత విమానాన్ని చెకింగ్ కోసం తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం
mumbai | air india | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu