TG Crime: మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!
నల్గొండ జిల్లా అనుముల కేవీ కాలనీలో గణేష్ మండపంలో విద్యుత్ షాక్కు గురై 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు దండెమ్ మహేందర్, మౌనికల కుమారుడు మణికంఠగా గుర్తించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో పాముకాటుకు గురై రైతు రఘురాములు మరణించాడు.