/rtv/media/media_files/2026/01/12/a-man-shoots-his-wife-inside-police-station-days-after-she-left-with-her-lover-in-uttarpradesh-2026-01-12-17-46-21.jpg)
A Man Shoots His Wife Inside Police Station Days After She Left With Her Lover in Uttarpradesh
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పోలీస్ స్టేషన్‌లోనే భర్త కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే అనూప్, సోని (35) దంపతులు. అయిదు రోజుల క్రితం సోని తన ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె భర్త అనూప్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య.. ఇంట్లోని నగలు, రూ.35 నగదు తీసుకెళ్లినట్లు ఆరోపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనూప్ భార్యను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: భారత్ నన్ను చూసి భయపడుతోంది...ఓ పాక్ ఉగ్రవాది మదం మాటలు
సోమవారం ఉదయం ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంటిన్‌కు ఓ మహిళా కానిస్టేబుల్ సోనీని తీసుకెళ్లింది. అక్కడ వేచిచూస్తున్న భర్త అనూప్.. సోనిపై దాడి చేసి తుపాకితో కాల్చేశాడు. అక్కడిక్కడే కింద పడిపోయిన సోనికి తీవ్రంగా రక్తస్రావమయ్యింది. తుపాకీ శబ్దానికి పోలీసులు గందరగోళానికి గురయ్యారు. చివరికి అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన అనూప్‌తో సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే తీవ్రంగా గాయాలపాలైన సోనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసు స్టేషన్ పరిధిలోనే భద్రతా లోపం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారితో పాటు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకు వీళ్లిద్దరిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అయితే భార్యను భర్త పోలీసు స్టేషన్‌లో కాల్చిచంపడం స్థానికంగా సంచలనం రేపుతోంది.
यूपी के हरदोई में इस शख्स ने थाने के अंदर अपनी पत्नी की गोली मारकर हत्या कर दी.
— Priya singh (@priyarajputlive) January 12, 2026
इस युवक की पत्नी पांच दिन पहले अपने प्रेमी के साथ घर से चली गई थी. इसने थाने में प्राथमिकी दर्ज करायी थी, और आरोप लगाया था कि पत्नी घर से जेवर और 35 हजार नकद लेकर गयी है.
इसी मामले में पुलिस ने… pic.twitter.com/bumtxUgE62
Follow Us