/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t122814-2026-01-12-12-28-54.jpg)
Sensation in the death case of a Bengaluru techie
Bengaluru Crime: బెంగళూరు టెకీ (Bengaluru Techie) మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె (34) విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఓ యువకుడు హత్య(murder) చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడిsexually-assaulted) కి అంగీకరించలేదని 18 ఏళ్ల యువకుడు ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. - benguluru techie news
అక్కెంచర్‌లో పనిచేస్తున్న షర్మిల డీకే (34) జనవరి 3న రామమూర్తి నగర్‌లోని సుబ్రహ్మణ్య లేఅవుట్‌లో ఉన్న తన అద్దె ఇంట్లో మృతిచెందిన స్థితిలో కనిపించారు.తొలుత అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఊపిరాడక ఆమె మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. మృతదేహం లభ్యమైన తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS)సెక్షన్ 194(3)(iv) కింద 'అనుమానస్పద మృతి' కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..
Sensation In The Death Case Of A Bengaluru Techie
మంగళూరుకు చెందిన షర్మిల రామమూర్తినగర ఠాణా పరిధిలో తన స్నేహితునితో కలిసి నివసించేది. సెలవు ఉండడంతో స్నేహితుడు ఊరికి వెళ్లిన సమయంలో ఆమె ఒంటరిగా గదిలో ఉంది. అయితే ఆ ఇంట్లో మంటలు రావడంతో వాటిని ఆర్పేందుకు విఫలయత్నం చేస్తూ కింద పడిపోయిందని, పొగ చూసి చుట్టుపక్కలవారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికే ఆమె మరణించి ఉందని వార్తలు వచ్చాయి. గతవారం జరిగిన ఈ ఘటనను అసహజ మరణంగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా తాజాగా కీలక విషయం వెల్లడైంది. 18 ఏళ్ల యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి పేరు కర్నాల్ కురై అని, మృతురాలి ఇంటి పక్కనే నివసిస్తున్నాడని తెలిపారు.
నిందితుడు విచారణలో అంగీకరించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. జనవరి 3న రాత్రి 9 గంటల సమయంలో కిటికీ నుంచి ఆ యువతి ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడని చెప్పారు. ‘‘ యువతిపై లైంగిక దాడి(sexually-assaults) కి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ముఖాన్ని అదిమిపట్టడంతో స్పృహ కోల్పోయింది. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. తర్వాత అక్కడినుంచి పారిపోయేముందు ఆమె దుస్తులు, ఇతర వస్తువులను కాల్చివేశాడు. ఆమె ఫోన్ తీసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు’’ అని పేర్కొన్నారు (Teen Killed Bengaluru Techie). ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాధితురాలి ఇంటి పక్కనే నివసిస్తున్న కర్నాల్ కురై అనే యువకుడే నిందితుడని తేల్చారు. విచారణలో కురై నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.జనవరి 3న రాత్రి సుమారు 9 గంటల సమయంలో స్లైడింగ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమె నోరు, ముక్కును బలవంతంగా మూసివేశాడని తెలిపాడు.
ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని పోలీసులు వెల్లడించారు. నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో బాధితురాలి దుస్తులు, ఇతర వస్తువులను బెడ్‌రూమ్‌లోని మంచంపై పెట్టి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయినట్టు విచారణలో బయటపడింది. పారిపోతూ ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న తరువాత,సేకరించిన ఆధారాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1) (హత్య), 64(2), 66, 238 (ఆధారాల నాశనం) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read : భారత్‌పై టెర్రరిస్టుల రివేంజ్.. ఆత్మహుతి దాడికి 1000 మంది సిద్ధం
Follow Us