/rtv/media/media_files/2026/01/13/woman-assaulting-home-guard-2026-01-13-13-28-41.jpg)
బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన సోనాలి సింగ్ అనే మహిళా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో నివసిస్తోంది. 31ఏళ్ల ఆ మహిళ KR పురం రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా ఆమె డ్రెస్సింగ్ చూసి.. కొంతమంది అబ్బాయిలు కామెంట్ చేశారు. అది గమనించి, అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డ్ లక్ష్మీనరసమ్మ ఆ అబ్బాయిలను బెదిరించి పంపించేసింది. తర్వాత.. "రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదమ్మా" అని మహిళా హోంగార్డ్ యువతికి సలహా ఇచ్చింది. హోంగార్డు చెప్పిన మాటలకు ఆగ్రహానికి గురైన సోనాలి సింగ్, ఆమెతో వాగ్వాదానికి దిగింది. "నేను ఏం వేసుకోవాలో చెప్పడానికి నువ్వు ఎవరు?" అంటూ కేకలు వేస్తూ, అతని చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, చెంప దెబ్బలు కొట్టింది. విధుల్లో మహిళా పోలీస్ అని కూడా చూడకుండా అందరి ముందే అసభ్య పదజాలంతో తిట్టింది. హోంగార్డును రోడ్డుపైనే జుట్టుపట్టుకొని రక్తమొచ్చేలా కొట్టింది.
Bengaluru Shocker! Woman arrested for assaulting home guard after being advised to wear proper clothes. pic.twitter.com/UBmbYVhdAt
— The Tatva (@thetatvaindia) January 13, 2026
అది చూసిన స్థానికులు హోంగార్డును మహిళ నుంచి కాపాడారు. తర్వాత హోంగార్డు ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. యువతి లేడీ హోంగార్డుని జుట్టుపట్టుకొని కొట్టడం స్థానికులు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. "మహిళా సాధికారత అంటే అధికారులపై దాడి చేయడం కాదు" అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఆమె ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దుస్తుల విషయంలో స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వారు, ఎదుటివారి గౌరవాన్ని కూడా కాపాడాలని అభిప్రాయపడుతున్నారు.
Follow Us