దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం

ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పోలీస్ సిబ్బందే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 19 ఏళ్ల యువతిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వారిలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్.

New Update
19-year-old girl raped

ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పోలీస్ సిబ్బందే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 19 ఏళ్ల యువతిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయం ఏంటంటే వారిలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. బంకిమోంగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 8 రాత్రి ఈ సంఘటన జరిగిందని, బాధితురాలికి తెలిసిన ఐదుగురు నిందితులలో ఒకరు ఆమెకు ఫోన్ చేశారని ఇక్కడి పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలిపై ఎమెర్జెన్సీ పోలీస్ టీం డ్రైవర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసులో డయల్ 112 పోలీస్ హెల్ప్‌లైన్ వెహికల్ డ్రైవర్‌తో సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

నిందితుడు యువతిని బంకిమోంగ్రాలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు ఆమెపై అత్యాచారం చేశారని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పాడు. సంఘటన తర్వాత, నిందితుడు బాధితురాలిని అపస్మారక స్థితిలో వదిలి అక్కడి నుండి పారిపోయాడు. తర్వాత బాధితురాలు ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారు వెంటనే ఆమెను మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును శుక్రవారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి, ఆ తర్వాత దర్యాప్తు కోసం బంకిమోంగ్రా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశామని ఆయన తెలిపారు. ఈ కేసులో కోర్బా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ తివారీ, 'డయల్ 112' సర్వీస్ ప్రైవేట్ డ్రైవర్ సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు