Gold: చెత్తలో దొరికిన 36తులాల బంగారం.. పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందంటే?

చెన్నైలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు నిజాయతీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

New Update
Chennai sanitation worker

చెన్నై లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు(Chennai sanitation worker) నిజాయతీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి, మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పింది.

Also Read :  ముగిసిన 78 ఏళ్ల ప్రస్థానం.. సంక్రాంతినాడే కొత్త ఆఫీస్‌లోకి ప్రధాని మోదీ

అసలేం జరిగింది? 

చెన్నైలోని టీనగర్ ప్రాంతంలో పద్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె యథావిధిగా రోడ్డుపై చెత్త సేకరిస్తుండగా, ఒక బ్యాగు కింద పడి ఉండటం ఆమె గమనించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో భారీగా బంగారు ఆభరణాలు(gold in garbage) కనిపించాయి. సుమారు 45 సవర్ల (360 గ్రాములు) బరువున్న ఆ నగలను చూసి ఆమె పరాయి సొమ్ముకు ఆశపడలేదు. కష్టపడితేనే కడుపు నిండుతుందని నమ్మే ఆమె, వెంటనే ఆ బ్యాగును తీసుకుని సమీపంలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు అప్పగించారు.

నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో నంగనల్లూరుకు చెందిన రమేష్ అనే వ్యక్తి తన నగల బ్యాగు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ బ్యాంకు వేలంలో నగలను కొనుగోలు చేసి అమ్ముతుంటాడు. ఆదివారం వేలంలో దక్కించుకున్న నగలతో వెళ్తుండగా, ప్రమాదవశాత్తూ టీనగర్ వద్ద ఆ బ్యాగును జారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసు స్టేషన్‌లో రమేష్‌కు తన నగలను అప్పగించిన అధికారులు, పద్మ నిజాయతీని కొనియాడారు. తన జీవితకాల సంపాదన కంటే ఎక్కువ విలువైన సొత్తు దొరికినా, పైసా ఆశించకుండా తిరిగి ఇచ్చిన పద్మను బాధితుడు రమేష్, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను "నిజాయతీకి బ్రాండ్ అంబాసిడర్" అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read :  షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు

Advertisment
తాజా కథనాలు