/rtv/media/media_files/2026/01/10/bangladesh-2026-01-10-16-51-52.jpg)
బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాజకీయ అస్థిరతను అడ్డం పెట్టుకుని దుండగులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. మరో హిందూ యువకుడిని శనివారం దారుణంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీనిని ప్రీ ప్లానింగ్ మర్డర్‌గా చెబుతున్నారు. గత 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా పెను కలకలం రేపింది. జనవరి మొదటి వారంలోనే (2026) ఈ వరుస హత్యలు జరగడం, ఇది మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
Bangladesh 🇧🇩 : Hindu boy (Joy Mohapatro) died after he was tortured & forced fed poison by
— 🇧🇩🕉️News (@SanataniHinduBD) January 10, 2026
" Amirul Islam " .
Location 📍 Dirai , Sunamganj . pic.twitter.com/YvZREInnCW
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బాధితుడు తన రోజువారీ కార్యక్రమాల్లో ఉండగా, కొంతమంది దుండగులు అతడిని చుట్టుముట్టారు. మొదట అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా, బాధితుడు ప్రాణాలతో ఉండకూడదని బలవంతంగా నోటిలో విషం పోశారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యుల ఆవేదన
"ఇది కేవలం ఏదో గొడవ వల్ల జరిగిన హత్య కాదు. మాపై ఉన్న కక్షతో, ఒక పథకం ప్రకారమే నా భర్తను చంపారు" అని బాధితుడి భార్య కన్నీరుమున్నీరవుతోంది. స్థానిక పోలీసులు ఈ ఘటనను సాధారణ నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ మతపరమైన విద్వేషమే దీనికి అసలు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్రిక్తతల్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యంలో, మత ఛాందసవాద శక్తులు చెలరేగిపోతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఆరుగురు హిందువులు దారుణంగా చంపబడ్డారు.
దీపు చంద్ర దాస్: మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలతో కొట్టి చంపి, చెట్టుకు కట్టి తగలబెట్టారు.
ఖోకోన్ చంద్ర దాస్: శరీయత్‌పూర్ జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో చికిత్స పొందుతూ మరణించారు.
అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్: వేర్వేరు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Follow Us