/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t131128-5-2026-01-12-13-11-51.jpg)
Thousands take to the streets in solidarity with Renee Nicolo Good
Renee Nicolo Good : అమెరికాలోని మిన్నెయాపోలిస్ ఇమ్మిగ్రేషన్ ఏజంట్ చేతిలో హత్యకు గురైన వలస మహిళ 37 ఏళ్ల రినీ నికోల్ గుడ్ కు దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ఆమెను ఐసీఈ ఏజెంట్ కాల్చి చంపాడాన్ని నిరసిస్తూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు.
మినియాపోలిస్‌లో బుధవారం ఇమిగ్రేషన్ ఏజెంట్ ఒకరు 37 ఏండ్ల మహిళను కాల్చి చంపారు. రెనీ నికోలో గుడ్ అనే మహిళ కారులో వస్తుండగా, ఆమె ఇంటికి సమీపంలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఏజెంట్ ఒకరు ఆమెను కాల్చి చంపారు. బుధవారం మినియాపాలిస్‌లో అధికారులు ఇమిగ్రేషన్ ఆపరేషన్‌ను నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. ఈ క్రమంలో కారులో కూర్చున్న నికోలోపై అధికారులు కాల్పులు జరిపారు. వలస దారులపై ట్రంప్ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేట్ అయిన రెనీ కవయిత్రి కూడా.
ఆమె రాసిన కవిత్వానికి అవార్డు కూడా వచ్చింది. గిటార్ వాయిస్తారు. ఆమె ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలకు న్యాయ పరిశీలకురాలిగా ఉన్నారని నగర నాయకులు తెలిపారు.అయితే ఆమె "స్థానిక ఉగ్రవాది" అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.ఆమె మరణాన్ని నిరసిస్తూ దేశం అంతటా "రీనికి న్యాయం జరగాలి" అని రాసి ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు. అధికారితో ఘర్షణ సమయంలో తన కుమార్తె అతనితో ఘర్షణ పడి ఉండవచ్చని ఆమె తల్లి డొన్నా గాంగర్ మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్‌తో చెప్పారు.ఈ ఘర్షణలో అధికారి ఆమెను కాల్చి చంపారని, తాను చూసిన వ్యక్తులలో తన కుమార్తె అత్యంత దయగల వ్యక్తి అని ఆమె అన్నారు. "ఆమె కరుణామయురాలు. తన జీవితాంతం అందర్నీ జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమెకు క్షమించే హృదయం ఉంది" అని గాంగర్ వార్తాపత్రికతో చెప్పారు.
కాగా రినీ నికోల్ గుడ్‌ను చంపాడాన్ని నిరసిస్తూ లక్షలాది మంది నిరసనకారులు రెండు రోజులుగా రోడ్లమీదకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూయర్క్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో జస్టిస్ నికోల్ గుడ్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజులు వద్దు. ఐసీఈ వద్దు, యుద్దాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. అలాగే పిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ. చికాగో, న్యూయార్క్, శాన్‌డీగో, బోస్టన్ తదితర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. నికోల్ గుడ్ కు న్యాయం జరిగే వరకు ఆందోళనలు సాగుతాయని నిరసన కారులు తేల్చి చెప్పారు.
Follow Us