క్రైం Hyderabad : ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. చిన్నారులు రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. వారిని కాపాడేందుకు తండ్రి పరిగెత్తుకు రాగా ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం West Bengal : ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి నాలుగు పెళ్లిళ్లు అయినట్లు విచారణలో తేలింది. నిందితుడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టారని.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయినట్లు పేర్కొన్నారు. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Madhuri: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు.. దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే ఇలా చేసినట్లు మాధురి చెబుతున్నారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS : పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..! తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. చింతూరు నుంచి ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి.. పైన ఇసుకను కప్పి తరలిస్తుండగా భద్రాచలం గోదావరి వంతెన వద్ద పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి.. కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థుల తల్లి ఆరోపిస్తోంది. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Marriage Act: అక్కడ ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లి.. మండిపడుతున్న హక్కుల సంఘాలు! ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ అక్కడ ఆడపిల్లల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్ ఈ బిల్లుపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు.. ప్రజలు మండిపడుతున్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: కార్ల వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం..16 కార్లు దగ్ధం! హర్యానాలోని గురుగ్రామ్ లోని ఓ కార్ల వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 16 లగ్జరీ కార్లు దగ్థమయ్యాయి.దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Radio Active Material: రూ. 850 కోట్ల విలువైన రేడియో ఆక్టివ్ మెటీరియల్ స్వాధీనం! బీహార్ పోలీసులు శుక్రవారం ఓ భారీ కేసును ఛేదించారు.ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn