TG Crime : అప్పులు, బ్యాంకు లోన్లు తీసుకుని ఫ్రెండ్స్ మోసం..  ఇంజెక్షన్లు తీసుకుని డాక్టర్ సూసైడ్

అప్పుగా డబ్బులు తీసుకున్న ఫ్రెండ్స్ తిరిగి చెల్లించకపోవడంతో  మనస్తాపానికి గురైన ఓ డాక్టర్ ఇంజెక్షన్లు తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది.

New Update
friends

TG Crime: అప్పుగా డబ్బులు తీసుకున్న ఫ్రెండ్స్ తిరిగి చెల్లించకపోవడంతో  మనస్తాపానికి గురైన ఓ డాక్టర్ ఇంజెక్షన్లు తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్(karimnagar) పట్టణంలో జరిగింది.  సీఐ సృజన్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..  కరీంనగర్‌ లోని మంకమ్మతోటకు చెందిన డాక్టర్ఎంపటి శ్రీనివాస్‌(43).. శివారులోని ఎనస్తీషియా డిపార్ట్ మెంట్ లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. అతని భార్య విప్లవశ్రీ కూడా డాక్టరే. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. అయితే శ్రీనివాస్‌ వద్ద ఇద్దరు స్నేహితులు అప్పుగా రూ.1.78  కోట్లు తీసుకున్నారు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' తుఫాన్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రైలర్..

మరో ముగ్గురు ఆయన పేరు మీద రూ.1.35 కోట్ల బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు. టైమ్ కు వారంతా డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్‌కు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే విషయంపై భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనివాస్. వారం రోజులుగా మానసిక వేదన, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో తన భార్య విప్లవశ్రీ  నిద్ర లేచి చూసేసరికి భర్త పడిపోయి ఉన్నారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Also Read: సైక్లోన్ మొంథా ఎఫెక్ట్.. ఈ జిలాల్లో స్కూల్స్ క్లోజ్..!

ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో కీలక పరిణామం

మరోవైపు విజయవాడ కేంద్రంగా వెలుగుచూసిన అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ ఆర్థిక మోసానికి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యను, అతని భార్య సుజాతను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసింది. ఆదిత్య 'అద్విక ట్రేడింగ్ కంపెనీ' పేరుతో ప్రజల నుంచి అధిక వడ్డీ (ప్రతి లక్షకు నెలకు రూ. 6,000 వరకు) ఆశ చూపి, పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించాడు.

Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

మొదట్లో కొన్ని నెలలు వడ్డీలు చెల్లించి, ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను నిలిపివేశాడు. ప్రాథమిక అంచనాల ప్రకారం, బాధితుల నుంచి సుమారు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మోసంలో వేలాది మంది పెట్టుబడిదారులు నష్టపోయారు. ప్రధాన నిందితుడు ఆదిత్యతో పాటు, అతని భార్య సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరికొందరు ఏజెంట్లను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నిందితులకు చెందిన పలు జిల్లాల్లోని రూ. 100 కోట్ల మార్కెట్ విలువ గల 52 స్థిరాస్తులను సిట్ గుర్తించింది. అలాగే, సుమారు 580 గ్రాముల బంగారం, రూ. 23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Also Read: తుఫాన్‌ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!

Advertisment
తాజా కథనాలు