విమానంలో రెండు హత్యలు.. భారతీయుడు అరెస్ట్

అమెరికాలోని చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఓ ఇండియన్ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. తోటి ప్రయాణికులైన ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడికి పాల్పడ్డాడు. సిబ్బందిపై కూడా చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు.

New Update
US-Germany Flight

అమెరికాలోని చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఓ ఇండియన్ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. తోటి ప్రయాణికులైన ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడికి పాల్పడ్డాడు. సిబ్బందిపై కూడా చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌లో దారి మళ్లించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం (అక్టోబర్ 25) చికాగో నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా విమానంలో ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) అనే భారతీయడు ఈ దాడికి పాల్పడ్డాడు. విమానంలో ఆహారం అందించిన తర్వాత, ప్రణీత్ తన సీటులో నిద్రిస్తున్న 17 ఏళ్ల టీనేజర్‌పై నిలబడి, అకస్మాత్తుగా మెటల్ ఫోర్క్‌తో అతడి భుజంపై పొడిచాడు. ఆ తర్వాత, పక్కనే కూర్చున్న మరో 17 ఏళ్ల యువకుడిపై కూడా దాడి చేసి, అతడి తల వెనుక భాగంలో గాయం చేశాడు.

ఈ దాడిని విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు మరింత ఆగ్రహంతో ఒక మహిళా ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. అలాగే, సిబ్బందిపై కూడా దాడికి ప్రయత్నించాడు. పరిస్థితి అదుపు తప్పడంతో పైలట్లు అప్రమత్తమై, విమానాన్ని అత్యవసరంగా అమెరికాలోని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అమెరికా అధికారులు నిందితుడు ప్రణీత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ కుమార్‌పై విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదకర ఆయుధంతో దాడికి పాల్పడటం అనే అభియోగం కింద ఫెడరల్ ఛార్జీలు నమోదు చేశారు. అతడు గతంలో స్టూడెంట్ వీసాపై అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చదివేందుకు వచ్చాడని, అయితే ప్రస్తుతం దేశంలో చట్టబద్ధమైన హోదా లేదని అధికారులు తెలిపారు. ఈ నేరం రుజువైతే ప్రణీత్ కుమార్‌కు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు