15 మంది మహిళల న్యూడ్ వీడియోస్.. హత్య కేసులో సంచలన విషయాలు!

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యూపీఎస్సీ అభ్యర్థి రామ్‌కేశ్ మీనా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి హత్యకు కారణం హార్డ్ డిస్క్‌లో భద్రపరిచిన 15 మంది మహిళలకు సంబంధించిన ప్రైవేట్ చిత్రాలు, వీడియోలేనని పోలీసులు గుర్తించారు.

New Update
Hard Disk

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యూపీఎస్సీ అభ్యర్థి రామ్‌కేశ్ మీనా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి లివ్ ఇన్ పాట్నర్‌ అమృతతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయకపోవడంతో మరో ఇద్దరితో కలిసి రామ్ కేశ్‌ను హత్య చేసింది. తర్వాత దాన్ని ఫైర్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో 15 మంది మహిళల ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రామ్‌కేశ్ మీనా (32) తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్‌లో తన సహజీవన భాగస్వామి అమృత చౌహాన్ (21)‌తో కలిసి ఉంటున్నాడు. అమృత ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని. రామ్‌కేశ్.. అమృతతో పాటు మరో 15 మంది మహిళలతో క్లోజ్‌గా ఉన్న వీడియోలు, నగ్న చిత్రాలను ఓ హార్డ్ డిస్క్‌లో సేవ్ చేశాడు. తన ప్రైవేట్ వీడియోలను డిలీట్ చేయాలని అమృత ఎంతగా వేడుకున్నా రామ్‌కేశ్ నిరాకరించాడు. దీంతో, ఆ హార్డ్ డిస్క్‌ను తీసుకోవడానికి, రామ్‌కేశ్‌ను అడ్డు తొలగించుకోవడానికి అమృత మాజీ లవర్ సుమిత్ కశ్యప్, అతని స్నేహితుడు సందీప్ కుమార్‌తో కలిసి కుట్ర పన్నింది.

హత్యను సాధారణ ప్రమాదంగా చిత్రీకరించేందుకు అమృత తన ఫోరెన్సిక్ పరిజ్ఞానాన్ని, క్రైమ్ వెబ్ సిరీస్‌ల నుంచి నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించింది. పథకంలో భాగంగా, అక్టోబర్ 5న రాత్రి ముగ్గురూ కలిసి రామ్‌కేశ్ ఫ్లాట్‌కు వెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా కనిపించేలా చేయడానికి, మృతదేహంపై నెయ్యి, నూనె, మద్యం పోశారు. అనంతరం వంటగదిలోని ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్‌ను తెరిచి, ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయారు. గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఫ్లాట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ద్వారా ఇది హత్య అని పోలీసులు నిర్ధారించి, అమృతతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. హార్డ్ డిస్క్‌తో పాటు హత్యకు ఉపయోగించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు