BIG BREAKING: కాలి బూడిదైన మరో స్లీపర్ బస్సు.. స్పాట్ డెడ్..!

కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పిలిభిత్ నుండి జైపూర్ కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.

New Update
BREAKING

BREAKING

కర్నూలు బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. దాదాపు 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదైపోయారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటికీ ఈ బస్సు ప్రమాదాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదాన్ని మరువక ముందే మరొక బస్సు అగ్నికి ఆహుతైంది. 

bus accident

జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుండి జైపూర్‌కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌లో చేర్చారు. 

బస్సు 11,000 వోల్ట్‌ల విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తగలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోపల ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఆందోలనకు గురయ్యారు. ఆ క్షణంలో వారికి ఏం చేయాలో తోచక.. వెంటనే కిందికి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బాధితులు షాపురాలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు. ఈ ఘోరమైన ప్రమదం ఉదవాలా సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను జైపూర్‌కు తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు పంపించారు. 

Advertisment
తాజా కథనాలు