BREAKING: మరో ఘోర ప్రమాదం.. ఢీకొన్న ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్.. స్పాట్‌లోనే 25 మంది?

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో- గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 RTC బస్సులు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

New Update
Bus Accident

Bus Accident

ఇటీవల కర్నూలు-హైదరాబాద్ హైవేపే ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా స్పాట్‌లోనే 19 మంది కాలి బూడిదయ్యారు. అయితే ఈ ఘటన మరవక ముందే చిత్తూరులో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో- గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 RTC బస్సులు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మదనపల్లె నుంచి పుంగనూరు వెళ్తున్న పల్లెవెలుగు బస్సును పలమనేరు నుంచి పుంగునూరుకు వస్తున్న పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. ఇదే సమయంలో రెండు ఆర్టీసీ బస్సులను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రమైంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: TG Crime: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని విద్యార్థి దుర్మరణం

ఇది కూడా చూడండి: BIG BREAKING: కర్నూలు బస్సు దుర్ఘటన సమీపంలో మరో ప్రమాదం.. 3 కార్లు నుజ్జు నుజ్జు!

Advertisment
తాజా కథనాలు