RIYAZ FAMILY :  కానిస్టేబుల్‌ ప్రమోద్‌ మృతిలో బిగ్‌ట్విస్ట్‌.. HRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబం

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు.

New Update
Rowdy sheeter Riyaz encounter

Rowdy sheeter Riyaz’s family claims he was murdered, meets hrc

RIYAZ FAMILY : ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC)ను ఆశ్రయించారు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను స్వగ్రామంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కమిషన్‌కు వివరించారు.

అంతేకాదు, మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్‌తో రియాజ్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని రియాజ్ కుటుంబ సభ్యులు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఒక కేసు విషయంలో ప్రమోద్‌ రూ.3లక్షలు డిమాండ్ చేశారని రియాజ్ కుటుంబం ఆరోపించింది.తప్పనిసరి పరిస్థితుల్లో రియాజ్ అప్పటికప్పుడు రూ. 30 వేలు చెల్లించాడని తెలిపారు. మిగతా డబ్బులు ఇవ్వాలని ప్రమోద్ రియాజ్‌ను తీవ్రంగా వేధించారని రియాజ్‌ భార్య ఆరోపించింది. తమను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గతంలోనే సుమోటోగా కేసు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వచ్చే నెల (నవంబర్) 24వ తేదీలోపు సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. 

మరోవైపు-- రియాజ్ కుటుంబీకుల ఫిర్యాదును HRC పరిగణలోకి తీసుకుంది.. ఈ మేరకు నివేదిక సమర్పణ గడువును మరింత తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోపే నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారం, కుటుంబ సభ్యుల ఫిర్యాదు దృష్ట్యా రాష్ట్ర పోలీసులకు మరింత త్వరగా నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమగ్ర నివేదికను నవంబర్ 3లోపే ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు