/rtv/media/media_files/2025/10/28/acid-case-2025-10-28-11-17-14.jpg)
ఢిల్లీలో బీకాం రెండో ఏడాది చదువుతున్న ఓ విద్యార్థిని తనపై యాసిడ్ దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ప్రైవేట్ క్లాస్ కు వెళుతుండగా..ముగ్గురు వ్యక్తులు తనపై యాసిడ్ దాడి చేశారని ఆరోపించింది. జితేందర్‌తో పాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ పేర్లను మెన్షన్ చేసింది. యాసిడ్ దాడి చేసినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడంతో గాయాలు అయినట్లు గా తెలిపింది. ఆ అమ్మాయి ఫిర్యాదును ఢిల్లీ పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేశారు. అయితే విచారణలో వారికి సంచలన విషయాలు తెలిశాయి.
అంతా నాటకమే..
విద్యార్థిని దాడి జరిగింది అని తెలిపిన ప్రాంతంలో ఎటువంటి యాసిడ్ ఆనవాళ్ళు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి చేశాడు అని చెబుతున్న జితేంద్ర కూడా అక్కడ లేనట్లుగా తెలిసింది. అతడు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోల్‌బాగ్‌లో సెల్‌ఫోన్ లొకేషన్ కనిపించింది. బైక్ పార్కు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇలా ఎలా చూసినా కూడా బాధితురాలు చెప్పిన స్టేట్ మెంట్ కు ఎక్కడా సరిపోవడం లేదని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు గట్టిగా నిలదీయడంతో బాధితురాలు నిజాన్ని అంగీకరించింది. కట్టుకథగా తేల్చింది. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు.
వ్యక్తిగత కక్ష..
బాధితురాలి తండ్రి అకీల్ ఖాన్ కు ఫ్యాక్టరీ ఉంది. అందులో జితేందర్ భార్య పని చేస్తోంది. ఆమెపై అకీల్ ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 నుంచి 2024 వరకు పని చేసిన సమయంలో అకీల్ ఖాన్ పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. దాని తరువాత అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు జితేంద్ర భార్య ఆరోపించింది. ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. తన కూతురిని రంగంలోకి దించాడు. యాసిడ్ దాడి సృష్టించి అందులో జితేంద్ర ను ఇరికించాలని ప్లాన్ చేశాడు. ఇక జితేందర్ మిత్రులైన ఇషాన్, అర్మాన్‌ను కూడా అకీల్ ఖాన్ బంధువులే. వీళ్లిద్దరితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళను కూడా ఇందులో పార్ట్ చేశాడు. కూతురు కూడా తండ్రికి బాగా సహకరించింది. చివరకు ఇద్దరూ పోలీసు విచారణలో దొరికిపోయారు. డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నారు. దీంతో తండ్రి, కూతురిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Stock Market: కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు
Follow Us