క్రైం Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Crime: పాపం.. తల్లి శవంతో రెండురాత్రులు అడవిలో పసిపాప అరకు దగ్గరలో ఒక తల్లి ఏడాది పాపను ఒడిలో పెట్టుకుని అడవిలో ఉరివేసుకుంది. రెండురోజుల తరువాత ఆ చిన్నారి దగ్గరలోని రోడ్డుపై గ్రామస్థులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకనే తల్లి అలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. By KVD Varma 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ? మన దేశంలో ప్రతీ గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రాజస్థాన్‌లో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : 300 అడుగుల లోయలో పడ్డ పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి మహారాష్ట్రలోని ముంబయి- నాసిక్ రహదారిపై వెళ్తున్న ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి 300 అడుగుల దిగువకు ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందం మృతదేహాలను బయటికి తీసింది. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్! ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata case: జూనియర్ డాక్టర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా.. అన్నీ పెద్ద తలకాయలే! జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసులో మరో కొత్తకోణం బయటపడింది. ఆమె హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ బలిపశువేనని, ఈ హత్య వెనుక పెద్ద తలకాయలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: స్పా సెంటర్లో పోర్న్ మూవీకి మించిన వ్యభిచారం.. ఒకేసారి నలుగురితో! హైదరాబాద్ చందానగర్ SVL టవర్స్‌లోని 'సాఫ్ట్ టచ్ స్పా సెంటర్'లో వ్యభిచారం గుట్టురట్టు అయింది. నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి ఉత్తరప్రదేశ్‌లోని షికార్పూర్ - బులంద్‌షహర్ రహదారిపై ఓ పికప్ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. పికప్ వ్యాన్‌లో ఉన్న బాధితులందరూ ఓ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangalore : బెంగళూరులో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడి కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరువకముందే బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతిపై.. ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn