Lawrence Bishnoi: మళ్లీ తెగబడ్డ బిష్ణోయ్ గ్యాంగ్.. పంజాబ్‌ కబడ్డీ ప్లేయర్ కాల్చివేత!

పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్‌ను కాల్చి చంపారు. అయితే తనని చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తమ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపింది.

New Update
Latest news

Crime News

బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో పంజాబ్ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని లుథియానా జిల్లాలోని సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్‌ను కాల్చి చంపారు. అయితే తనని చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తమ గ్యాంగ్‌కు చెందిన కరణ్, తేజ్ అనే ఇద్దరు వ్యక్తులు గుర్వీందర్ సింగ్‌ను హత్య చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

ఇది కూడా చూడండి: Uttar Pradesh: మరో రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

ఇటీవల ఓ పారిశ్రామిక వేత్తని..

ఇదిలా ఉండగా ఇటీవల భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్‌సింగ్‌ సహాసిని కెనడాలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చంపినట్లు తెలిపింది. డబ్బులు ఇవ్వలేదని హత్య చేసినట్లు తెలిపింది. అలాగే కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్‌ ఇంటి వెలుపల జరిగిన కాల్పులు కూడా తామే జరిపినట్లు వెల్లడించింది. వరుసగా పంజాబ్‌లో ఇలాంటి హత్యా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన  చెందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు