BIG BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. రెండు రైళ్లు ఢీ.. 10 మంది మృతి

ఛత్తీస్‌గడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్‌లోని జైరాం స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్సు రైలును ప్యాసెంజర్‌ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. 

New Update
Train Accident

Train Accident

ఛత్తీస్‌గడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్‌లోని జైరాం నగర్ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్సు రైలును ప్యాసెంజర్‌ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో  10 మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఎదురెదురగా రైళ్లు ఢీకొన్నాయి. బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. 

Also Read: పో*ర్న్‌ సైట్లు నిషేధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఈ రూట్‌లో రానున్న రైళ్ల దారి మళ్లించారు. ఈ ప్రమాదం వల్ల ఆ రైలు మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్‌ సిస్టమ్స్‌ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న కోచ్‌లను పట్టాల నుంచి బయటికి తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. 

Advertisment
తాజా కథనాలు