Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హల్లిఖేడ్‌లో వ్యాను, కారు ఢీకొనడంతో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన వారు.

New Update
ACCIDENT

ACCIDENT

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) అధికంగా జరుగుతున్నాయి. అధిక వేగం, నిర్లక్ష్యం, వీటికి సరైన శిక్షలు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ప్రమాదం జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా వ్యాను ఢీకొనడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హల్లిఖేడ్‌లో వ్యాను, కారు ఢీకొనడంతో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60)గా పోలీసులు గుర్తించారు. గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Hyderabad: నాలుగేళ్ళ చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు..హైదరాబాద్ లో దారుణం

Karnataka Road Accident

ఇది కూడా చూడండి: Tirupathi News: ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!

Advertisment
తాజా కథనాలు