/rtv/media/media_files/2025/10/06/rape-2025-10-06-21-13-39.jpg)
rape
మానవ మృగాల దారుణాలకు అంతు లేకుండా పోతోంది. తమ వాంఛలు తీర్చుకోవడానికి ఎంతటి ఆకృత్యానికి అయినా పాల్పడుతున్నారు. వయసు కూడా చూడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం బయటపడింది. బోయిన్ పల్లిలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్న మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా తన వద్దకు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ళ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా హింసించాడు. దీంతో ఆపాప చాలా పడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో ఏమైందని పేరెంట్స్ గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.
పోక్సో కేసు..
దీంతో పాప పేరెంట్స్ వెంటనే డాన్స్ మాస్టర్ సుబ్బు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు జ్ఞానేశ్వర్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జ్ఞానేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించామని.. స్టూడియోను సీజ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు చెడు, మంచి స్పర్శలపై అవగాహన కల్పించాలంటూ సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరోసారి లైంగిక వేధింపుల విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Follow Us