Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం పై సుమోటోగా కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.

New Update
Telangana Human Rights Commission takes suo motu cognizance of Chevella lorry-bus accident

Telangana Human Rights Commission takes suo motu cognizance of Chevella lorry-bus accident

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ లారీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటాగా కేసు నమోదు చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ ఛైర్‌పర్సన్ ఆధ్వర్యంలో ఈ కేసు నమోదు చేశారు. 

Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO

రోడ్డు భద్రతా లోపాలు, రహదారి విస్తరణ, అధిక వేగం, అధికారుల నిర్లక్ష్యం లాంటి అంశాలపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రవాణా, హోం, గనులు, భూగర్భ శాస్త్రం శాఖలు, NHAI, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారుల నుంచి పూర్తి స్థాయి రిపోర్టులను డిసెంబర్ 15న ఉదయం 11 గంటల లోపు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. 

Also Read: అప్పుడు 40 మందిని కాపాడి... ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు : బస్సు డ్రైవరన్న అలా చేయకపోయింటే!

ఇదిలాఉండగా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొంది. వికారాబాద్‌ జిల్లా కరణ్‌కోట్‌ సమీపంలో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ తలకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. 

Advertisment
తాజా కథనాలు