అమ్మకానికి అమ్మాయిలు.. రూ.10వేలకే తెలంగాణ To రాజస్థాన్!
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోల్కతాలోని లా విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత యువతి మెడ, రొమ్ములపై పదునైన పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు.
స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్ అనే యువకుడిని ఊరి చివరకు తీసుకెళ్లి అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. ఆపై బావిలో పడేశారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతిచెందాడు. బ్రెయిన్ హ్యామరేజ్కి చికిత్స తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతన్ని 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ దాడులకు పాల్పడ్డారు.