/rtv/media/media_files/2025/12/23/fotojet-20-2025-12-23-08-07-36.jpg)
11
Crime News : ఆధునికత ఎంత వేగంగా అభివృద్ధి చెందిన కులాలు, మతాలు, ఆచారాలు అనే నమ్మకాలు ఇంకా మనిషిని వదిలి పెట్టడం లేదు. పరువు పేరుతో ప్రాణాలు తీసుకోవడం, తీయడం సర్వసాధారణమైంది. తాజాగా దళిత యువకుణ్ని వివాహం చేసుకుందన్న కక్షతో గర్భిణిగా ఉన్న కుమార్తెను తండ్రి మరో ఇద్దరి సాయంతో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాన్య పాటిల్ (19) వివేకానంద ఇద్దరూ క్లాస్‌మెట్స్. డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. వివేకానంద అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ ఏడాది మేలో పెళ్లి చేసుకుంది.
వివేకానంద దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో లింగాయత సముదాయానికి చెందిన అమ్మాయి తండ్రి ప్రకాశ్ గౌడ పాటిల్ వారి వివాహానికి ఒప్పుకోలేదు. తనను వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వివేకానందను మాన్య బెదిరించడంతో జూన్ 19న ఇద్దరూ ఆలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు.అనంతరం పోలీసులను ఆశ్రయించడంతో యువతి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు రాజీ చేయించారు. తన తల్లిదండ్రులకు ఇష్టానికి విరుద్ధంగా ఈ పెళ్లి చేసుకున్నందునా తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని భయపడిన మాన్య పాటిల్ గ్రామానికి100 కిలోమీటర్ల దూరంలో హవేరి జిల్లాలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే కొంతకాలంగా ఎలాంటి గొడవలు లేకపోవడంతో పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుని ఇటీవలే ఆమె తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది.
దీన్ని గుర్తించిన మాన్య తండ్రి ప్రకాశ్.. లోలోపల రగిలిపోయాడు. ఆదివారం సాయంత్రం కూతురు భర్త కుటుంబంపై తన బంధువులు వీరనగౌడ మహాదేవగౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్‌లతో కలిసి వెళ్లి ఇనుప పైపులు ఇతర ఆయుధాలతో దాడికి దిగాడు. ఇంట్లోకి చొరబడి అత్యంత కిరాతకంగా దాడి చేశారు.ఈ ఘటనలో ఆరు నెలల గర్భవతి అయిన మాన్యను రక్షించేందుకు ఆమె అత్తమామలు ప్రయత్నించినా విఫలమయ్యారు.తీవ్ర గాయాలతో మాన్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె అత్తమామలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇక నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించిన తీరు అందరిని కలిచి వేసింది. ఈ ఘనటలో పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
Follow Us