మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య

ఉన్నత విద్య చదువుకున్నా..వివాహేతర బంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్తను భార్య దారుణంగా విషం పెట్టి హత్య చేసింది. అది కూడా కేవలం వివాహేతర సంబంధం విషయంలో కావడం గమనార్హం.

New Update
FotoJet (2)

Illegal Affair.. wife killed her husband

Medchal Lecturer killed by his wife : ఉన్నత విద్య చదువుకున్నా..వివాహేతర బంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. ఇద్దరిలో ఏ ఒకరికి ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకుంటే ముగిసిపోయే బంధాన్ని  భర్తలను భార్యలు, భార్యలను భర్తలు చంపుకుంటూ పిల్లలను అనాధలను చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్తను భార్య దారుణంగా విషం పెట్టి హత్య చేసింది. అది కూడా కేవలం వివాహేతర సంబంధం విషయంలో కావడం గమనార్హం. ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక ప్లే స్కూల్ నడుపుతూ విద్యావంతురాలిగా పేరున్న పూర్ణిమ అనే మహిళ, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకున్న భర్తనే కిరాతకంగా అంతమొందించింది. తన ప్రియుడు మహేష్‌తో కలిసి పథకం ప్రకారం ఆహారంలో విషం కలిపి భర్తను హతమార్చిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   తన ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లికి చెందిన అశోక్ వృత్తిరీత్యా లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పూర్ణిమ తమ ఇంట్లోనే ఒక ప్లే స్కూల్ నడుపుతోంది. అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 11వ తేదీన అశోక్ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే, భర్తకు గుండెపోటు వచ్చిందని, అందుకే మరణించాడని పూర్ణిమ బంధువులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.  అయితే పోలీసులు మాత్రం .. అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు రావడంతో  రొటీన్ ప్రాసెస్ లో భాగంగా పోస్టుమార్టం నిర్వహించారు. 

అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇటీవల అందిన పోస్టుమార్టం నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.  అశోక్ మరణంపై పోలీసులు కూడా మొదట పెద్దగా అనుమానం వ్యక్తం చేయలేదు.కానీ పోస్టు మార్టం రిపోర్టులో అశోక్ ది సహజ మరణం కాదని, ఆయనపై విషప్రయోగం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేసి పూర్ణిమను తమదైన పద్ధతిలో విచారించగా అసలు నిజం బయటపడింది. వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉండే 25 ఏళ్ల యువకుడు మహేష్‌తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త అశోక్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన తీరు మార్చుకోవాలని అశోక్ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న పూర్ణిమ, తన ప్రియుడితో కలిసి భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.

పథకం ప్రకారం.. పూర్ణిమ ఈ నెల 11న ఆయన తినే ఆహారంలో విషం కలిపి పెట్టింది. అది తిన్న కొద్దిసేపటికే అశోక్ ప్రాణాలు విడిచారు. అనంతరం మూడు చున్నీలను అశోక్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హాల్‌లో హత్య చేసిన తర్వాత, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పై అంతస్తులోని బెడ్ రూమ్‌కు చేర్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అశోక్ సోదరికి ఫోన్ చేసి, అశోక్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, స్పృహ లేకుండా పడిపోయాడని నమ్మబలికారు. అశోక్ సోదరి వచ్చి చూసేసరికి అశోక్ అచేతనంగా పడి ఉన్నాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె ప్రశ్నించగా, బాత్‌రూమ్‌లో కింద పడటం వల్ల ఆ దెబ్బలు తగిలాయని పూర్ణిమ అబద్ధం చెప్పింది. మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా ఉండేందుకు పూర్ణిమ, మహేష్ గట్టిగా ప్రయత్నించారు. ఆసుపత్రి వద్దకు మహేష్ కూడా వచ్చి పోస్టుమార్టం అవసరం లేదని కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయడం అనుమానానికి తావిచ్చింది.

వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో అది ‘హత్య’ అని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. మహేష్‌తో కలిసి తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, అశోక్ చనిపోయిన పది రోజుల పాటు పూర్ణిమ ఇంట్లో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ దశదిన కర్మలు నిర్వహించింది. ఈ పది రోజుల్లోనూ ఆమె రహస్యంగా తన ప్రియుడు మహేష్‌తో చాటింగ్ చేయడమే కాకుండా, మూడు రోజుల క్రితం అతనితో కలిసి షాపింగ్‌కు కూడా వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.    

Advertisment
తాజా కథనాలు