బట్టబయలవుతున్న ట్రంప్ నిజస్వరూపం.. చిన్న పిల్లలని కూడా చూడకుండా..

జెఫ్రీ ఎప్‌స్టీన్  కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా బయటపడిన ఎప్‌స్టీన్ డాక్యుమెంట్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావనకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

New Update
epstin fiels

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడి మెడకు ప్రస్తుతం ఓ ఉచ్చు బిగుసుకుంది. ఆయనే కాదు ప్రపంచంలోనే ప్రముఖ బిజినెస్‌మ్యాన్లు, సెలబ్రెటీల పేర్లు బయటపడుతున్నాయి. యూఎస్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తుండగానే జైళ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జెఫ్రీ ఎప్‌స్టీన్  కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా బయటపడిన ఎప్‌స్టీన్ డాక్యుమెంట్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావనకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

ట్రంప్ పేరు, ఎప్‌స్టీన్ ఫైల్స్

జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో భాగంగా కోర్టు ఆదేశాలతో ఇటీవల కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. గతంలోనే ట్రంప్, ఎప్‌స్టీన్ ఒకప్పుడు ఫ్రెండ్స్ అని తెలిసినప్పటికీ, ఈ కొత్త ఫైల్స్ కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాయి. ముఖ్యంగా ఎప్‌స్టీన్‌కు చెందిన ప్రైవేట్ జెట్ ఉంది. దీనిని తరచుగా 'లోలితా ఎక్స్‌ప్రెస్' అని పిలిచేవారు. ప్రయాణాలకు సంబంధించి ట్రంప్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే, ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నారు. 2004లోనే తాను ఎప్‌స్టీన్‌తో సంబంధాలను తెంచుకున్నానని ఆయన గతంలోనే ప్రకటించారు.

ఆ 20 ఏళ్ల యువతి ఎవరు?

ఈ తాజా వివాదంలో ఒక 20 ఏళ్ల యువతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎప్‌స్టీన్ బాధితుల్లో ఒకరైన వర్జీనియా గిఫ్రే ఇచ్చిన వాంగ్మూలంలో ఈ యువతి ప్రస్తావన ఉంది. రికార్డుల ప్రకారం, ఆమె ఎప్‌స్టీన్ నిర్వహించే పార్టీలలో పాల్గొనేవారని, అక్కడ ఉన్న ప్రముఖులకు ఆమెను పరిచయం చేసేవారని తెలుస్తోంది. అయితే, ఆమెకు ట్రంప్‌తో నేరుగా సంబంధం ఉందా లేదా అనే విషయంపై స్పష్టమైన ఆధారాలు ఇంకా బయటకు రాలేదు. ఆమె ఓ 'కీలక సాక్షి'గా ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ప్రైవేట్ జెట్ 'డార్క్ సీక్రెట్' 

ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో జరిగే ప్రయాణాలను అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆ జెట్‌లో ప్రయాణించే వీఐపీల లిస్ట్ బయటకు రాకుండా ఎందుకు దాచారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎప్‌స్టీన్‌కు చెందిన ప్రైవేట్ ఐల్యాండ్'లిటిల్ సెయింట్ జేమ్స్'కు ఈ జెట్‌లో ఎంతో మంది ప్రముఖులు వెళ్లేవారు. ఈ జెట్‌లో మైనర్ బాలికలను అక్రమంగా తరలించేవారని, అక్కడ వారికి లైంగిక వేధింపులు ఎదురయ్యేవని ఆరోపణలు ఉన్నాయి.


ఈ విమాన ప్రయాణాల వివరాలు బయటపడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అసలు స్వరూపం బయటపడుతుందనే భయంతోనే ఆ వివరాలను ఇన్నాళ్లూ తొక్కిపెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పదవిలో ఉన్న తరుణంలో ఈ పాత ఫైల్స్ మళ్లీ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యర్థి వర్గాలు దీనిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుండగా, ట్రంప్ మద్దతుదారులు ఇవన్నీ పాత ఆరోపణలేనని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, ఎప్‌స్టీన్ 'బ్లాక్ బుక్'లో ఉన్న పేర్లు పూర్తిగా బయటకు వస్తే మరిన్ని సంచలనాలు తప్పవు.

Advertisment
తాజా కథనాలు