Year Ender 2025 : నేరాలకు కేరాఫ్...రాచకొండ..పెరిగిన క్రైమ్ రేటు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాలు ఘననీయంగా పెరిగాయి. 2024లో 28,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో ఈ సంఖ్య 33,040కు పెరిగింది. మహిళలపైనా గత ఏడాదితో పోలిస్తే 4 శాతం అధికంగా నేరాలు నమోదైనట్లు తెలుస్తోంది.

New Update
FotoJet (4)

Rachakonda CP Sudheer Babu

Year Ender 2025 : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాలు ఘననీయంగా పెరిగాయి. 2024లో 28,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో ఈ సంఖ్య 33,040కు పెరిగింది. మహిళలపైనా గత ఏడాదితో పోలిస్తే 4 శాతం అధికంగా నేరాలు నమోదైనట్లు తెలుస్తోంది. సోమవారం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో 2025లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాల వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు వివరించారు.

ఈ ఏడాది కిడ్నాప్‌, ఫోక్స్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది 579 కిడ్నాప్‌ కేసులు..1,224 ఫోక్సో చట్టం కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే మర్డర్ ఫర్ గెయిన్ 3, దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589 , వాహనాల చోరీ 876 , సాధారణ చోరీలు 1,161, హత్యలు 73, అత్యాచారాలు 330, వరకట్నం చావులు 12, గృహ హింస కింద 782 కేసులు నమోదయినట్లు సుధీర్ బాబు వెల్లడించారు.  

కాగా, ఈ ఏడాది‘కమిషనరేట్‌ పరిధిలో21,056 కేసులను (78 శాతం) పరిష్కరించామన్నారు. 12 కేసుల్లో దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష పడేలా చేశామన్నారు. అడ్డగూడూరు పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు పడిందన్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేశాం. 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశాం. సైబర్ క్రైమ్ బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేశామని వివరించారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 495 మందిని అరెస్టు చేసి.. రూ.20 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు 322 మంది, ఇతర రాష్ట్రాల వారు 172 మంది, ఒక విదేశీయుడు ఉన్నారన్నారు. కమిషనరేట్ పరిధిలో 227 ఎన్డీపీఎస్‌ అనుమానిత షీట్లను తెరిచాం. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఫ్రీ కమిషనరేట్‌గా రాచకొండను తీర్చిదిద్దాం’’ అని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

వీటితో పాటు  దోపీడి కేసులు 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీలు 589 వాహనాల చోరీలు 876, సాధారణ చోరీలు 1,161,హత్యలు 73, అత్యాచారాలు 330, వరకట్నం మరణాలు 12, గృహ హింస కేసులు 782 నమోదైనట్లు వివరించారు.ఈ ఏడాది ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 689 మంది అరెస్ట్ కాగా.. 6,824 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని వివరించారు.ఈ ఏడాది గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుల్లో 1,472 మంది అరెస్ట్ కాగా.. రూ. 69 లక్షల ప్రాపర్టీ సీజ్ చేశామని వివరించారు.

మానవ అక్రమ రవాణా కేసులో..ఈ ఏడాదిలో 73 కేసులు నమోదు చేయగా. 8 స్థావరాలు గుర్తించామన్నారు.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగాయి. గత ఏడాది 3,207 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3,488 కేసులు నమోదయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 659 మంది మృరణించారు. ORRపై జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారు.డ్రంక్ అండ్ డ్రైవ్ లో 17,760 కేసులు నమోదు కాగా.. రూ.3.89 కోట్లు జరిమానా వసూలు చేశారు. 5,821 మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేశామని సీపీ వివరించారు.

Advertisment
తాజా కథనాలు