/rtv/media/media_files/2025/12/23/fotojet-23-2025-12-23-10-21-53.jpg)
Telangana phone tapping case
Telangana phone tapping case : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హారీష్‌రావుకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారన్నదానిపై సిట్ దృష్టి సారించింది.
కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్.. హరీష్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ ఇప్పటికే మాజీ సీఎస్.. ఇంటలిజెన్స్ చీఫ్ ల నుంచి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ సమయంలో అనేక అంశాలను రాబట్టింది. ప్రభాకర్ రావు పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఇంటలిజెన్స్ అధికారి అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కు నోటీసులు జారీ అంశం ఈ కేసులో కీలక మలుపుగా మారనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో.. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ ఈ కేసులో ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది.
సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ సహా.. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ తో పాటుగా మరి కొందరి అధికారుల ను సిట్ విచారణ చేసింది. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వేసులో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ని వారిని సిట్ మరోసారి విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారించింది. వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను సిట్ రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది.మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. Also Read TTD కీలక నిర్ణయం - మూడు మార్గాల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి..!! గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోపాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిథిగా హోం శాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ చార్జిషీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది.
మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. అయితే.. మరోవైపు ఈ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఆయన్ని విచారించేందుకు సిట్‌లో సభ్యుడు అయిన సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్ రావును సిద్ధిపేట సీపీ విచారించనున్నారు.
Follow Us