/rtv/media/media_files/2025/12/23/fotojet-22-2025-12-23-09-57-33.jpg)
5 Killed as Mexican Navy Medical Plane Crashes in Texas
Mexican Navy plane crash : మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్‌వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న ఈ విమానం ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మెక్సికో (Mexico) నౌకాదళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇందులో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారని వారు వివరించారు. అయితే ప్రమాదంలో వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టం చేయలేదు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్ అధికారులు వివరించారు.
ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గాల్వేస్టోన్ కౌంటీ ఫెరీఫ్ కార్యాలయం ఈ ప్రమాదంపై స్పందించింది. సహాయక చర్యల కోసం డ్రోన్ యూనిట్‌తో సహా రెస్క్యూ సిబ్బంది ఆ స్థలానికి వెళ్లినట్లు వివరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. అయితే, ప్రమాదానికి పొగమంచే కారణమా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో నిండిపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Follow Us