/rtv/media/media_files/2025/12/23/migrant-worker-lynched-in-kerala-after-being-mistaken-as-bangladeshi-2025-12-23-19-26-41.jpg)
Migrant Worker Lynched In Kerala After Being Mistaken As Bangladeshi
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశ్ వ్యక్తిగా పొరబడి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్ నారాయణ్ బఘేల్(31)గా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన రామ్ నారాయణ్ ఉపాధిపని కోసం ఇటీవల కేరళకు వచ్చాడు. పనికోసం కొన్నిరోజులుగా తిరుగుతున్నాడు.
Also Read: మధ్యప్రదేశ్‌లో 42లక్షల మంది ఓటర్లకు CEC బిగ్ షాక్
డిసెంబర్ 17న అత్తపల్లం అనే గ్రామంలో కొందరు స్థానికులు అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానించారు. దొంగతనం ఆరోపణలతో బంధించారు. దీంతో కొందరు నీ గుర్తింపు ఏంటి అంటూ కొట్టడం మొదలుపెట్టారు. నువ్వు బంగ్లాదేశ్ వాడివి, నీ భాషా ఏంటి ? నీ ఊరు ఏంటి ? అంటూ అందరూ కలిసి మూకదాడి చేశారు. బాధితుడు తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఛాతి నుంచి కూడా రక్తం వచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: విజయ్ మాల్యా, లలిత్ మోదీపై ఉన్న ఆరోపణలు ఏంటి ? భారత్ వీళ్లను ఎందుకు రప్పించలేకపోతోంది ?
సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడి శరీరంపై 80కి పైగా గాయాలున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు 18వ తేదిన అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ మతానికి చెందిన దీపూ చంద్రదాస్(25)ను హత్య చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో అతడిని కొట్టి చంపడం దుమారం రేపింది.
Follow Us