Drugs: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు నైజీరియన్లు అరెస్టు

డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను హైదరాబాద్‌‌లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించి డబ్బులు సంపాదించి విదేశాలకు తరలిస్తున్నారు. వీరి దగ్గర నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Drugs

Drugs

హైదరాబాద్‌‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించి డబ్బులు సంపాదిస్తున్న వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సంపాదించిన డబ్బులను విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

గతేడాది కూడా ముగ్గురిని..

ఈ ముగ్గురుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఫిబ్రవరిలో కూడా పోలీసులు నైజీరియాకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

ఇదిలా ఉండగా ఇటీవల ఓ లేడీ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. డ్రగ్స్ నిర్మూలించాల్సిన పోలీసులే యథ్దేచ్చగా వారి వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటిండాలో చోటుచేసుకుంది. చెకింగ్ పాయింట్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కారును ఆపి చూసిన పోలీసులు కంగుతిన్నారు. ఆ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్‌ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ తన వాహనంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందింది.

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి కౌర్‌ డ్రైవ్‌ చేస్తున్న వాహనాన్ని భటిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో అడ్డగించారు. తనిఖీ చేయగా గేర్‌ బాక్స్‌ వద్ద దాచిన 17.71 గ్రాముల హెరాయిన్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే నిబంధనల ప్రకారం పోలీస్‌ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు.

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

 

Latest crime news | hyderabad | drugs | latest telangana news | telugu crime news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు