Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

అలోవేరా జ్యూస్ అనుకొని  ఓ14 ఏళ్ల బాలిక పురుగుల మందు తాగి మరణించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీపాంజలినగర్ కు చెందిన నిధి కృష్ణ అనే బాలికకు రోజూ అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది.

New Update
nidhi-krishna

nidhi-krishna

అలోవేరా జ్యూస్ అనుకొని  ఓ14 ఏళ్ల బాలిక పురుగుల మందు తాగి మరణించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీపాంజలినగర్ కు చెందిన నిధి కృష్ణ అనే బాలికకు రోజూ అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు.

గమనించక పురుగుల మందు తాగి

అయితే అది గమనించక పురుగుల మందు తాగిన  నిధి కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీపాంజలి 9వ తరగతి చదువుతోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఇంట్లో పురుగుమందులను నిల్వ చేసేటప్పుడు తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు