Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ సారి రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజల పరుగులు తీశారు. మరోవైపు ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా ఇవి తాకినట్లు సమాచారం.

New Update
Nepal Earthquake Today:

Nepal Earthquake Today

ఈ మధ్య తరచూ వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల మయన్మార్‌లో జరిగిన భూ ప్రలయంతో వందలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూమి కదిలింది. ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇది స్వల్ప భూకంపం అని తెలుస్తోంది. 

Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

5.0గా నమోదు

ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.0గా నమోదైంది. గర్ఖాకోట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో.. దాదాపు 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. నిన్న అంటే శుక్రవారం సాయంత్రం 7.52 గంటల టైంలో ఇది సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. మరోవైపు ఈ భూప్రకంపనలు ఉత్తర భారత్‌‌ను తాకినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పలు ప్రాంతాల్లో భూమి వణికినట్లు తెలుస్తోంది. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మరోవైపు పపువా న్యూగియాలో

ఈ రోజు తెల్లవారు ఝామున పపువా న్యూగియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై 6.9 గా నమోదయింది. వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.  దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  పపువా న్యూ గినియాలో ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా ఉందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

(earthquake | latest-telugu-news | telugu-news | viral-news | earthquake news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు