TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

తన ఆరోగ్యం బాగోలేదని స్నేహితుడిని నమ్మి తన కూతురి బాధ్యతలు అప్పగిస్తే చిన్నారిపై లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు. కోర్టు అతడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మరో ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

New Update
court verdict 2

court verdict 2

తన ఆరోగ్యం బాగోలేదని స్నేహితుడిని నమ్మి తన కూతురి బాధ్యతలు అప్పగిస్తే చిన్నారిపై లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు.  తాజాగా కోర్టు అతడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ షాహిన్ నగర్ కు చెందిన వ్యక్తికి 15 ఏళ్ల కూతురు ఉంది. అయితే అతని ఆరోగ్యం బాగా లేకపోవడం, తల్లి లేకపోవడంతో తన కూతురి బాధ్యతలను కొంతకాలం చూసుకోవాలంటూ 2021లో తన స్నేహితుడు సయ్యద్ హజీ అలీ(43)కి అప్పజెప్పాడు.

కూతురు వరసయ్యే ఆ బాలికపై

అయితే కూతురు వరసయ్యే ఆ బాలికపై సయ్యద్ హజీ కన్నేసాడు. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాడు.  అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పగా అతను పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు చేసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తర లించారు. రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, ఆధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా కూడా విధించారు. ఈ కేసులో బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారాన్ని కూడా కోర్టు ప్రకటించింది. 

కామాంధుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష

ఇక మరో ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు.  సీతారాంబాగ్ ఓల్డ్ మల్లేపల్లికి మెతుకరి సత్య నారాయణ చారి(44) కార్పెంటర్ గా పని చేసేవాడు. అయితే 2022లో ఓ బాలికను లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు రిజిస్టర్ అయింది.  పోలీసులు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో సహా పక్కా ఆధారాలు సేకరించి 12వ అడిష నల్ నాంపల్లి సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 2022లో మొదలైన కోర్టు విచారణ దాదాపు మూడేండ్ల పాటు కొనసాగింది. తాజాగా కోర్టు నిందింతుడికి 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు