TG Crime : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

ఇద్దరు బాగా చదువుకున్నారు. జీవితంలో బాగా స్థిరపడిపోయారు.  కానీ పెళ్లి కావడం లేదన్న బాధతో తమ జీవితానికి స్వస్తి పలికారు. వేరువేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చాయి.

New Update
pelli

pelli

ఇద్దరు బాగా చదువుకున్నారు. జీవతంలో బాగా స్థిరపడిపోయారు.  కానీ పెళ్లి కావడం లేదన్న బాధతో తమ జీవితానికి స్వస్తి పలికారు. వేరువేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కన్నవాళ్లకు కన్నీళ్లు మగిల్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..   వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురానికి చెందిన వేణు(30) బీటెక్‌ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో తక్కువ జీతానికి జాబ్ చేస్తున్నాడు. వేణుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడగా తక్కువ జీతం  అని పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన వేణు ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఇంట్లో ఉరేసుకున్నాడు. చేతికందొచ్చిన కొడుకు ఆత్మహత్యక పాల్పడడంతో వేణు తల్లిదండ్రులురాజేశ్వర్‌రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read :  అలా చేస్తే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు.. సుప్రీంకోర్టు కీలక వార్నింగ్!

Also read :  మా హనీమూన్ అక్కడే.. పెళ్లి తర్వాత అఘోరి, వర్షిణీ జంట సంచలన వీడియో!

పెళ్లి కావట్లేదని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మరోవైపు జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని-- ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ  2020 బ్యాచ్‌. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరినప్పటినుంచి క్రమశిక్షణగా పనిచేస్తుండేది. అందరితోనూ స్నేహంగా నడుచుకునేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.  కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read : ఎక్కువ చేయొద్దు.. ఎంపీ చామలకు సీఎం రేవంత్ క్లాస్.. ఆ ఎమ్మెల్యేలకు కూడా..!.

Also read :  మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!

 

marriage | latest telangana news | telangana crime cases | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు