Conistable case: పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్నమహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. జనగామ జిల్లాకు చెందిన నీల.. హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లో AR కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి ఆలస్యానికి వరకట్నమే కారణంగా బయటయపడగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్థాయికి మించిన కట్నం..
జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన హేమ్‌లాల్, చియా దంపతుల మూడో సంతానం నీల. నీలకు సునీత, సురేష్, సోనియా అనే ముగ్గురు తోబుట్టువులున్నారు. అయితే తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది నీల. ఈ క్రమంలోనే వచ్చిన సంబంధాల్లో ఎక్కువమంది వారి స్థాయికి మించిన కట్నం అడిగారు. నీల ఫ్యామిలీ ఇవ్వలేని స్థితిలో ఉంది.
Also Read: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!
బాధనంతా డైరీలో రాసుకుని..
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాపేద కుటుంబంలోకి వెళ్లలేక నీల మదనపడింది. ఉన్నతస్థాయి ఫ్యామిలీలకు కట్నం ఇవ్వలేక ఒత్తిడికి లోనైంది. తన పరిస్థితి ఏమిటంటూ తనలో తాను ఏడుస్తూ బాధనంతా డైరీలో రాసుకుంది. పెళ్లిపై తన కుటుంబం సరైన బాధ్యత తీసుకోలేదని కూడా మనస్థాపం చెందిన నీలిమ దారుణానికి పాల్పడింది. ఇక మరోవైపు నీల దండ్రి హేమ్ లాల్ మాత్రం తమకంటే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న అబ్బాయిలు చూడటానికి వస్తే.. తమ బిడ్డకు ఉద్యోగం ఉన్నందున ఎదురుకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇది కూడా నీలను ఒత్తిడికి గురిచేసినట్లు సమాచారం.
Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !
janagam | sucide | today telugu news