/rtv/media/media_files/2025/04/15/RWMKEL8aNCLRI69jP2J9.jpg)
chamala kiran cm revanth
పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదని.. అంతేకాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు.
Also Read : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
ఎమ్మెల్యేలకు వ్యకిగత అపాయింట్‌మెంట్
రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే మన టార్గెట్ అని సీఎల్పీ భేటీ మీటింగ్ లో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని వారికి తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు తాను వ్యకిగత అపాయింట్‌మెంట్ ఇస్తానని.. రెండోసారి గెలిచేందుకు మీ నియోజకవర్గంలో ప్రభావితం చేసే పనులు పట్టుకురండని ఎమ్మెల్యేలకు చెప్పారు.
Also Read : HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌పై సీఎం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. రోజుకో మంత్రిని నువ్వే ప్రకటిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ పార్టీ నేతలపై సీఎం మండిపడ్డారు. పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్‌మీడియా వాడడం లేదన్న సీఎం.. ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
Also Read : సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం
Also Read : రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?
hyderabad | clp-meeting | mp chamala kiran kumar reddy | latest telangana news | telangana politics news | latest-telugu-news | breaking news in telugu | today-news-in-telugu