లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, శ్రీవర్షిణిలు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని కాళిమాత గుడిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. వేదమంత్రాల సాక్షిగా వర్షిణి మెడలో అఘోరీ శ్రీనివాస్ తాళి కట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి తరువాత ఈ జంట ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. హనీమూన్ కు ఎక్కడికి వెళ్తున్నారంటే.. హనీమూన్ అంటూ ఏమీలేదని.. కొన్ని ఆలయాలకు వెళ్తామని, అదే పెద్ద హనీమూన్ అని శ్రీవర్షిణి చెప్పుకొచ్చింది. తాను త్వరలోనే ఓ ఆశ్రమం కూడా కడుతున్నామని నార్త్ లోనే ఉంటామని లేడీ అఘోరీ వెల్లడించారు. చట్టం ప్రకారం తమ పెళ్లి జరిగిందన్నారు. మరి లేడీ అఘోరీ మొదటి భార్య పరిస్థితి ఏంటీ అన్నది పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ చూడండి.