/rtv/media/media_files/2025/11/28/tollywood-no1-hero-2025-11-28-12-10-52.jpg)
Tollywood No1 Hero
Tollywood No1 Hero: టాలీవుడ్ అభిమానుల మధ్య తరచూ హాట్ టాపిక్ గా నిలిచే ప్రశ్న ఒకటి ఉంది: “టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో ఎవరు?”. ఈ ప్రశ్న అడిగితే, మీరు కనీసం ఐదు-ఆరు పేర్లను వింటారు. కొద్దిగా ఎక్కువగా వాదిస్తే, ఒక్కసారే చర్చ గొడవగా మారుతుంది. ప్రతి ఫ్యాన్‌కి తన అభిప్రాయం, తన హీరోనే నెంబర్ వన్ అని. ఎవరి అభిమాన హీరో మీద వారికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది.
కానీ అద్భుతం ఏమంటే, ఈ సమస్యకు AI టూల్స్ ఒకే సమాధానం ఇచ్చాయి. Chat GPT మాత్రమే కాదు, Grok AI, Perplexity, Gemini వంటి ఇతర ప్రముఖ AI టూల్స్ కూడా ఒకే పేరును చేబుతున్నాయి ఆ పేరే ప్రభాస్.
/rtv/media/post_attachments/d0c9d106-f92.png)
/rtv/media/post_attachments/713b458a-fa7.png)
ప్రభాస్ పేరే ఎందుకు..? Prabhas Tollywood No 1 Hero : AI Tools
AI లు ప్రభాస్‌ను జాతీయ స్థాయి ఫ్యాన్ బేస్, భారీ ప్రాజెక్ట్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ వలన నెంబర్ వన్ గా గుర్తించినట్లు చెప్పాయి. దేశవ్యాప్తంగా అభిమానులు, భారీ బడ్జెట్ చిత్రాలు, సోషల్ మీడియాలో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్ అన్ని కలిపి AI లకు ప్రభాస్ నంబర్ 1 హీరోగా కనిపించాడు.
అలాగే, AIలు నంబర్ 2 హీరోగా అల్లు అర్జున్ను(Allu Arjun) గుర్తించారు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమాలు, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆధారంగా అల్లు అర్జున్ ను నంబర్ 2 హీరోగా గుర్తించాయి.
నంబర్ 3 స్థానానికి ఒక చిన్న తేడా ఉంది. Grok తప్ప, మిగతా AI లు మహేష్ బాబుని(Mahesh Babu)ఎంచుకున్నాయి. Grok మాత్రం రామ్ చరణ్ని(Ram Charan) 3వ స్థానంలో పేర్కొంది.
నంబర్ 4, 5 స్థానాల గురించి చూస్తే, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(NTR) మధ్య కొంత పోటీ కనిపిస్తోంది. ఈ ఫలితాలు, అభిమానుల్లో కొత్త చర్చలు, వాదనలు తేవడానికి కారణమవుతున్నాయి.
మొత్తంగా, AI ఆధారిత ర్యాంకింగ్ ప్రకారం, ప్రభాస్ నంబర్ 1 హీరోగా నిలుస్తున్నాడు. తరువాత అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, Jr NTR వంటి స్టార్లు ఒక ర్యాంక్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది.
అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ర్యాంకింగ్ ఫ్యాన్స్ అభిప్రాయం కంటే భిన్నంగా ఉండొచ్చు. కానీ, AI సమాధానాలు ఇప్పటి టాలీవుడ్ పరిస్థితులను అంచనా వేస్తూ, హీరోల గుర్తింపు, అభిమానుల క్రేజ్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా ఇచ్చిన ఆసక్తికర ఫలితాలు కాబట్టి, ఇవి కొత్త చర్చలకు కారణం అయ్యాయి.
ఇప్పుడు, అభిమానులు కూడా ఈ AI ఫలితాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ, నంబర్ 1 హీరో ఎవరని మరొకసారి చర్చలకు తెచ్చారు.
Follow Us