/rtv/media/media_files/2025/05/19/ubgWL62s0wQMLeSOIINC.jpg)
Telugu Upcoming Movies
Telugu Upcoming Movies: తెలుగు బాక్సాఫీస్(Tollywood Box Office) కి సమ్మర్ సీజన్(Summer Movies) చాలా మంచి సీజన్.. కానీ కొన్నేళ్లుగా సమ్మర్ కి సరైన సినిమాలు రాక థియేటర్లు ఎండాకాలం ఎండిపోతున్నాయి. అయితే, ఈసారి సమ్మర్ పరిస్థితులు కాస్త భిన్నంగా మారాయి. పెద్ద హీరోల సినిమాలు ఏమీ రాకపోయినా, చిన్న సినిమాల హవా బాగానే నడిచింది.
Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..
వరస హై బడ్జెట్ మూవీస్..
ఈసారి వేసవి మే చివరి వారం నుండి జూలై మొదటి వారం వరకు తెలుగు సినిమాలకు తోడు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ సినిమాల విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సీజన్ లో పెద్ద సినిమాలు చూడని థియేటర్స్ ఇప్పుడు ఏకంగా వరస హై బడ్జెట్ చిత్రాలు రిలీజ్ లతో సందడి చేయబోతున్నాయి.
Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!
జూన్ 5న కమల్ హాసన్(Kamal Hassan) - మణిరత్నం(Mani Ratnam) కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం “థగ్ లైఫ్”(Thug Life) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తర్వాత జూన్ 12న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన “హరిహర వీరమల్లు”(Hari Hara Veera Mallu) విడుదల కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలాకాలంగా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఆడియెన్స్‌లో భారీగా ఆసక్తి రేపుతోంది.
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
ఇక జూన్ 20న ముగ్గురు స్టార్ నటుల కలయికలో రూపొందుతున్న సినిమా “కుబేర”(Kubera) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna), శేఖర్ కమ్ముల(Shekhar Kammula) కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.
అదే తేదీకి, అంటే జూన్ 20న, మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప”(Kannappa) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ విఎఫ్‌ఎక్స్, ఆలిండియా యాక్టర్ల ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
Also Read: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
తర్వాత జూలై 4న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన “కింగ్డమ్”(Kingdom) గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనితో ఇంక పెద్ద సినిమాల రిలీజ్ లకు మళ్ళీ కొంత గ్యాప్ రానుంది.
మొత్తానికి, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ సమ్మర్ సీజన్, చివరికి ప్రేక్షకులకు ఫుల్‌టైం ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమైపోయింది. ప్రేక్షకులు ఈ హై బడ్జెట్ చిత్రాల రాకతో మళ్లీ థియేటర్స్ కు భారీగా వస్తారని సినీ పరిశ్రమ ఆశిస్తుంది.