Retro Collections: సూర్యకి(Surya) "రెట్రో" రూపంలో సాలిడ్ హిట్ పడిందనే చెప్పాలి. గతేడాది "కంగువా" చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోయినా, "రెట్రో" ఆ లోటును తీరుస్తూ సూర్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. మే 1న విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, జోజూ జార్జ్, జయరామ్, నాజర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. సూర్య ఈ సినిమాలో ఒక ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించి తన నటనతో అలరించాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రేమ, కుటుంబ భావాలు కథకు బలంగా నిలిచాయి.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, "రెట్రో" సినిమా 18 రోజుల్లో దాదాపు రూ. 235 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది అని తెలిపారు. సూర్య తన సినీ జీవితంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'రెట్రో' మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రానికి అద్భుత స్పందన లభించింది.
Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025
Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4
టాప్ ప్లేస్ లో "రెట్రో"
ఇంతకుముందు సూర్య నటించిన "24" సినిమా రూ. 157 కోట్లు, "సింగం 2" రూ. 122 కోట్లు, "7th సెన్స్" రూ. 113 కోట్లు, "కంగువా" రూ. 106 కోట్లు, "సికిందర్" రూ. 95 కోట్లు వసూలు చేశాయి. అయితే వీటన్నింటినీ అధిగమిస్తూ "రెట్రో" టాప్ ప్లేస్ దక్కించుకుంది.
Also Read: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
అయితే, ఈ సినిమా తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు, అనెక్సపెక్ట్డ్ గా విడుదలైన "టూరిస్ట్ ఫ్యామిలీ" అనే చిత్రం మంచి టాక్ అందుకుంటూ కోలీవుడ్ మార్కెట్లో "రెట్రో"కి గట్టి పోటీగా నిలిచింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఆ పోటీ లేకపోయుంటే "రెట్రో" సులువుగా రూ. 300 కోట్ల మార్క్‌ను తాకేదని చెబుతున్నారు.
Also Read: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
మొత్తానికి, "రెట్రో" సూర్యకి కంటెంట్ బేస్డ్ సినిమా అయినప్పటికీ మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
Also Read: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు