Kubera Movie Updates: ధనుష్, నాగార్జున వార్.. కుబేర రిలీజ్ డేట్ వచ్చేసింది!
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 20 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. శేఖర్ కముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.