/rtv/media/media_files/2025/05/19/hsAgj2k89F3NBEruAjGC.jpg)
Shilpa Shirodkar tested covid postive
Covid 19: ఆరేళ్ళ క్రితం దేశాన్ని పట్టి పీడించిన కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. గడిచిన వారంలో ఆసియాలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వందల సంఖ్యల్లో మరణాలు కూడా నమోదైనట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఆరోగ్య శాఖ.
నటికి కరోనా పాజిటివ్
ఈ క్రమంలో బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందరు మాస్క్ లు ధరించి సేఫ్ గా ఉండమని సూచించారు. దీంతో తోటి నటీనటులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. శిల్ప శిరోద్కర్ మహేష్ బాబు భార్య నమ్రతకు అక్క అవుతారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడమే కరోనా కేసులు వేగంగా పెరగడానికి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలే సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. కరోనాతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తిచెందటం ఆందోళనకరంగా మారిందని అంటున్నారు నిపుణులు. ఆసియాలోని హాంకాంగ్, సింగపూర్ లోనే వైరస్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. మే 3 తర్వాత వారంలోనే భారీ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రజలు టీకాలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది కోవిడ్ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారు' అని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు తెలిపారు.