/rtv/media/media_files/2025/07/12/divorce-from-wife-bathing-with-40-liters-of-milk-2025-07-12-19-49-54.jpg)
Divorce from wife.. Bathing with 40 liters of milk
Divorce from wife : భార్యల చేతిలో భర్తలు దారుణంగా హత్యకు గురవుతున్న సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఈ సంఘటనలతో "సోలో లైఫే సో బెటర్' అంటూ పెళ్లంటేనే జంకుతున్నారు బ్యాచిలర్స్. అయితే పెళ్లంతో విడాకులు తీసుకుంటే ఇంకా హ్యాపీ అంటున్నాడు అస్సాంకు చెందిన యువకుడు. అంతేకాదు ఆ ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.
అస్సాంలోని ముకల్మువా స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ ఆనందంతో నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు. ఈ రోజు నుండి నేను స్వేచ్ఛజీవిని అంటూ, విడాకులు విజయవంతంగా పూర్తి అయినందుకు ఆనందంగా ఉందంటూ పాలతో స్నానం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో,వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాణిక్ అలీ మీడియాతో మాట్లాడారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె రెండు సార్లు మరోకరితో పారిపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ కూతురు కోసం చాలాసార్లు క్షమించినట్లు వెల్లడించారు.కానీ తన భార్య మారకపోవడంతో చట్టబద్ధంగా విడిపోయినట్లు తెలిపారు.
భార్య టార్చర్ నుంచి విముక్తి పొందిన తాను ఇప్పుడు సంతోషంగా ఫీలవుతున్నానని వెల్లడించారు. విడాకులు తీసుకున్న తర్వాత తను కొత్త జన్మను పొందిన ఫీల్ వస్తోందని అన్నారు. అందుకే కొత్త జీవితం ప్రారంభించడానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎన్నో సంవత్సరాల భారాన్ని అతను తగ్గించుకున్నాడని అందుకే పాలతో స్నానం చేసినట్లు మరో నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.