Tamannah: ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

తమన్నా భాటియా ఓడెల 2 విడుదలకు ముందు బాబుల్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించి, సంప్రదాయ బంగాళీ చీరలో ఆకట్టుకుంది. ఆమె లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.

New Update
Tamanna

Tamanna

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా తన తాజా చిత్రం ఓడెల 2 విడుదలకు ముందు ముంబయి నగరంలోని ప్రసిద్ధ బాబుల్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించారు. తన బిజీ ప్రమోషన్ షెడ్యూళ్ల నుంచి కొద్దిసేపు విరామం తీసుకుని, ఆధ్యాత్మికత వైపు మళ్ళిన తమన్నా, ఈ ప్రత్యేక సందర్భానికి సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమనడం విశేషం.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఈసారి గ్లామరస్ లుక్‌ను పక్కన పెట్టిన తమన్నా, సంప్రదాయ బంగాళీ శైలిలోని ఎరుపు-తెలుపు కలయికలో ఉన్న చీరను ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఇది కేవలం ఆచారాన్ని పాటించడం మాత్రమే కాకుండా, ఆమెలోని స్టైల్ సెన్స్‌ను మరోసారి చాటిచెప్పింది.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

రెగ్యులర్ లుక్‌కు భిన్నంగా ఈ సిల్క్ చీరపై గోధుమరంగు డిజైన్‌లు ఉండగా, ఎరుపు రంగు జరీ బోర్డర్ ఆ చీరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. గజ్రాతో అలంకరించిన స్లిక్ జుడాతో పాటు, స్మూత్  మేకప్ లో, తక్కువ ఆభరణాలతో తమన్నాలుక్స్ అదిరిపోయాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఏప్రిల్ 17న ఓదెల 2

అయితే తమన్నా ఆధ్యాత్మిక ప్రయాణంలో తన విశిష్టమైన శైలిని, సంప్రదాయానికి తాను ఇచ్చే గౌరవాన్ని మరోసారి నిరూపించారు. సోషల్ మీడియా వేదికగా తమ్మన్నా లుక్స్  ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. అయితే తమన్నా తాజా చిత్రం ఓదెల 2 ఈ నెల ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

actress-tamannah-bhatia | 2025 Tollywood movies | latest tollywood updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | tollywood-actress | tollywood celebrity news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు