/rtv/media/media_files/2025/04/12/uzZwcB7JVFWeCxcIkfb0.jpg)
Chiranjeevi Dance
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్సు, ఫైట్స్ ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించి, సినిమా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ప్రత్యేకంగా, చిరంజీవి డ్యాన్స్‌లో చూపించే అద్భుత గ్రేస్ ఎవరికీ సాధ్యం కాదు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు చిరు డ్యాన్సులను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సరికొత్త డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. అయితే, నటన కోసం చిరు తన ప్రాణాన్ని కూడా లెక్కచేయరని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణకు ఓ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
సినిమా కోసం 103 డిగ్రీల జ్వరంలో డ్యాన్స్:
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా కనిపించారు. సినిమా కంటే ముందు పాటల షూటింగ్ చేసారు, కానీ చిత్రానికి కీలకమైన ఒక పాట తీయడం మిగిలి ఉంది. ఆ పాట లేకుండా సినిమా విడుదల చేయలేని పరిస్థితి తప్పనిసరిగా దాన్ని చిత్రంలో కలిపి విడుదల చేయాల్సి వచ్చింది.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
అయితే, షూటింగ్ సమయంలో చిరంజీవికి తీవ్ర జ్వరంతో పాటు మలేరియా కూడా సోకింది. ఆయనకు 103 డిగ్రీల జ్వరం ఉండగా, తన చిత్రంలోని ముఖ్యమైన పాటను వాయిదా వేస్తే, నిర్మాతకు నష్టం జరగుతుందని అంచనా వేసిన చిరంజీవి, జ్వరం ఉన్నా, డ్యాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
పాట కోసం ప్రాణాన్ని కూడా లెక్కచేయని చిరంజీవి:
సినిమా షూటింగ్ సమయంలో, చిరంజీవి పలు సార్లు తనను తాను అదుపు చేసుకోలేక, కింద పడిపోయారు. అయితే, వైద్యుడిని వెంట తీసుకుని షూటింగ్‌కి హాజరయ్యారు. తీవ్ర అస్వస్థత అయినా, చిరంజీవి తన వృత్తి మీద ఉన్న నిబద్ధతతో చివరికి ఈ పాటను పూర్తి చేసారు, పాత పూర్తవ్వగానే చిరంజీవి స్పృహతప్పి కింద పడిపోయారు. వెంటనే ఆయన్ని సమీపంలోని విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత ఆయన కోలుకున్నారు.
Also Read: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..
ఈ సంఘటనతో చిరంజీవికి సినిమా పట్ల ఉన్న అభిమానానికి, త్యాగానికి ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు ప్రశంసలు అందించారు. "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమా విడుదల తర్వాత భారీ విజయం సాధించింది.