/rtv/media/media_files/2025/04/12/ZhkPUAj5CYkWEoET5xAe.jpg)
Allu Arjun – Atlee Movie
Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.
ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.
Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!
మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.