/rtv/media/media_files/2025/04/12/RD4jnd5UudlXveXKbuNz.jpg)
Shrasti Verma New Car
Shrasti Verma: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కెమెరా వెనుక ఉన్న కళాకారులు ఎక్కువగా వెలుగులోకి రారు. అయితే ఇటీవల కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ మాత్రం తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఘటనలతో వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రష్ఠి వర్మకి మొదటి గుర్తింపు స్టార్ మా ఛానెల్ ప్రసారం చేసిన ప్రముఖ డాన్స్ రియాలిటీ షో "ఢీ" ద్వారా వచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి(Jani Master) అసిస్టెంట్‌గా పని చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ సాన్నిహిత్యం ఎంతో కాలం నిలవలేదు. ఇటీవలే వీరి మధ్య అనుకోని గందరగోళం నెలకొని, పోలీసు కేసుల దాకా వెళ్లింది.
Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.
ఈ పరిణామాల నుంచి బయటపడిన శ్రష్ఠి, తన కెరీర్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 చిత్రంలోని కొన్ని పాటలకు కొరియోగ్రఫీ చేసినట్టు చెప్పుకుంటూ, షూటింగ్‌లో తీసిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోల ద్వారా ఆమెకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు వచ్చింది.
Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!
శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్..
తాజాగా, ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ శ్రష్ఠి వర్మ కొత్తగా హుండాయ్ కారు కొనుగోలు చేసింది. కొత్త కారుతో తీసుకున్న ఫొటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా శ్రష్ఠి వర్మ పోరాటం ఫలించిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!